Skip to content

‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల

‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల Telugu News

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి.. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన హీరో, హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపించాయి. ఇక ఈ కథలో భార్యాభర్తల బంధం, తల్లీకొడుకుల అనుబంధాన్ని గొప్పగా చూపించినట్టు కనిపిస్తోంది. అన్ని రకాల ఎలిమెంట్స్‌ను జోడించిన ఈ కథను అద్భుతంగా మలిచినట్టు అనిపిస్తోంది. యాక్షన్స్, విజువల్స్, బీజీఎం ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి.

నిహారిక కొణిదెల గారు ట్రైలర్ పై, ‘‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. స్వాసిక గారు అద్భుతంగా కనిపిస్తున్నారు. పాత్రకు న్యాయం చేసినట్టుగా అనిపిస్తోంది. ఇలాంటి ఓ హృద్యమైన కథతో వస్తోన్న శశి గారికి ఆల్ ది బెస్ట్. విజయ్ ఆంటోనీ గారిని చూస్తుంటే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఎమోషన్స్, రిలేషన్ షిప్స్‌ను కలిపి గొప్ప కథను అందించబోతోన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’ అని పోస్ట్ చేశారు.

ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఇక ఈ మూవీని జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ : ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత : రామంజనేయులు జవ్వాజి
దర్శకుడు : శశి
సంగీతం : బాలాజీ శ్రీరామ్
డీఓపీ : ఎస్. బి. దర్శన్ కిర్లోష్
ఎడిటర్ : హరిష్ యువరాజ్
మాటలు : భాష్య శ్రీ
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.