Skip to content

క్యాన్సర్ పేషెంట్ కి యాంకర్ శ్రీనివాస్ సంజయ్ రక్తదానం!

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ సంజయ్ మహా న్యూస్ రిపోర్టర్ మరియు యాంకర్ గా పని చేస్తున్నాడు. ఈయన18వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. 18సార్లు అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ తరఫున అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేశాడు. మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేసే అలవాటు ఉన్న సంజయ్ బ్లడ్ అవసరం ఉందన్న సమాచారం తెలిస్తే చాలు రక్త దానం చేసేవాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పెడనకు చెందిన అమలేశ్వరి హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . ఆమెకు అత్యవసరంగా బ్లడ్ అవసరం అవుతుంది డోనర్ కోసం వారి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్ సంజయ్ నేనున్నాను అని ముందుకు వచ్చాడు. శుక్రవారం హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడాడు. అమలేశ్వరి కుటుంబ సభ్యులు యాంకర్ శ్రీనివాస్ సంజయ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా 18 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు.