ఆలియా భట్ ‘ఆల్ఫా’ చిత్రం ట్రైలర్ విడుదల
ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా.. శర్వారి కీలక పాత్రలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. జూలై 3న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం మేకర్స్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇద్దరు అందమైన హీరోయిన్స్ డెడ్లీ రోల్స్‌లో కనిపించనున్నారు. సరదాగా, థ్రిల్లింగ్‌గా రూపొందిన ఈ భారీ పాప్ కార్న్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ను గమనిస్తే.. ఆలియా భట్‌ను శక్తివంతురాలిగా తయారు చేసే మెంటర్‌గా బాబీ డియోల్ క్రూరమైన పాత్రలో కనిపించారు. హంతకురాలి పాత్రలో ఆలియా భట్ నటించింది. అయితే ఆమె కొన్ని పరిస్థితుల్లో తనకు శిక్షణ ఇచ్చిన మెంటర్కే…
