Skip to content

100 మంది జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ రికార్డింగ్

అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుంచే ‘ఎల్లమ్మ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో జానపద సంగీతంలోని అసలైన పవర్ ను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.

దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేస్తున్నారు.

రాక్‌స్టార్ డీఎస్పీ నటుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

100 మంది జానపద రిథమ్ ప్లేయర్లు.. ఒక్కటై మోగనున్న శక్తివంతమైన సంగీత హోరు తో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది.

ఈ సంగీత తుఫాన్‌ను ఆస్వాదించేందుకు రెడీగా ఉండండి.. ఈ సాంగ్ త్వరలో విడుదల కానుంది.

‘ఎల్లమ్మ’ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 5, 2027 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: దేవిశ్రీ ప్రసాద్

సాంకేతిక బృందం
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
రచన, దర్శకత్వం: వేణు యెల్దండి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.