‘ఎల్లమ్మ’ నుంచి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్
విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న 'బలగం' చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. ఇది DSP కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 'ఎల్లమ్మ' చిత్ర బృందం ఈ రోజు 'పర్షి'గా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. DSP పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్, ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ…
