Skip to content

“ఘంటసాల ది గ్రేట్” డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్

“ఘంటసాల ది గ్రేట్” డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ Telugu News

తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల బయోపిక్ రూపొందించారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి కేవలం ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల చేత ఔరా అనిపించారు. ఈ జీవిత చరిత్రాత్మక చిత్రం ఆదిలోనే ఘనమైన స్పందనను పొందుతోంది.

ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు.

ఘంటసాల గారి వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రీవ్యూ షోలు నిర్వహించగా.. అక్కడి భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “ఘంటసాల గారి గాత్రం, గౌరవం, మహిమను మరోసారి అనుభవించే అవకాశం ఇచ్చింది” అని వాళ్లంతా అక్కడి మీడియాకు వెల్లడించారు. లెజెండ్ ఘంటసాల బయోపిక్ ఇంత గ్రాండ్ గా, ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చేసిన దర్శకుడు సి.హెచ్. రామారావు ప్రతిభను అంతా మెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం, వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్. అదేవిధంగా విడుదలకు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ఘంటసాల గారి అమరగానాన్ని, ఆయన అసామాన్య జీవితాన్ని మరోసారి గుర్తు చేసేలా రూపొందించిన ఈ సినిమా కోట్లాది మంది ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు మేకర్స్.

నటీనటులు : సుమన్, కృష్ణ చైతన్య, మృదుల , తులసి మూవీ ఫేమ్ అతులిత, సుబ్బరాయు శర్మ, జే.కె. భారవి, సుమన్ శెట్టి, అనంత్, సాయి కిరణ్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, జయవాణీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : అన్యుక్త్ రామ్ పిక్చర్స్
నిర్మాత : శ్రీమతి సి.హెచ్. ఫణి
రచన, దర్శకత్వం : సి.హెచ్. రామారావు
సంగీతం: సాలూరి వాసు రావు
కెమెరా: వేణు మురళీధర్
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.