Skip to content

నాగ చైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రతి సినిమాతో తెరపై కొత్తదనాన్ని చూపించే నాగ చైతన్య.. ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్‌తో తన స్క్రీన్ ప్రెజెన్స్‌లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. స్టైల్, అటిట్యూడ్, ఎనర్జీ కలగలిసిన ఈ పాటలో అర్జున్ పాత్రను పరిచయం చేశారు. అసాధారణమైన సాహస యాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్ హంటర్‌గా అర్జున్‌ను ఈ పాటలో చూపించారు.

బి. అజనీష్ లోక్‌నాథ్ ట్రెండీ బీట్స్‌తో అదిరిపోయే కంపోజిషన్ అందించడమే కాకుండా, తన ప్రత్యేకమైన వాయిస్ తో పాటను మరింత ఆకట్టుకునేలా పాడారు. లిరిసిస్ట్ అభినవకవి తన సాహిత్యంతో కథానాయకుడి స్వాగ్, అటిట్యూడ్‌ను అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ‘ఐయామ్ బార్న్ టు రూల్’ అనే పవర్‌ఫుల్ క్యాచ్‌లైన్ అర్జున్ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చింది.

తన సాహస యాత్రకు అర్జున్ ఎలా సిద్ధమవుతున్నాడో ఈ పాట ద్వారా ఆసక్తికరంగా చూపించారు. స్టైలిష్, కాన్ఫిడెంట్ అవతార్‌లో నాగ చైతన్య ఆకట్టుకున్నారు. ఆయన ఎలిగెంట్ బాడీ లాంగ్వేజ్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ, చైతన్య ఈజీగా చేసిన డ్యాన్స్ మూవ్స్, స్టైలిష్ స్టెప్స్ ఈ పాటను విజువల్ ట్రీట్‌గా నిలిపాయి.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్

ఈ ఎనర్జిటిక్ ట్రాక్ ద్వారా అర్జున్ ప్రపంచాన్ని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. రహస్యాలు, సాహసాలు, ఉత్కంఠతో సాగనున్న అర్జున్ ప్రయాణంపై ఈ పాట మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ సింగిల్‌తో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు బ్లాక్‌బస్టర్ ఆరంభం లభించింది. రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌పై కూడా అంచనాలు మరింత పెరిగాయి.

నటీనటులు: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ

సాంకేతిక బృందం:

దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రఘుల్ డి. హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ చారి చెన్నోజు
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.