వృషకర్మ డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ !
యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్. సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. కార్తిక్ దండు…
