Skip to content

‘భోగి’ డబ్బింగ్ పూర్తి చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

చార్మింగ్ స్టార్ శర్వా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కందుల సులోచన రాణి పాత్రలో ఆమె ఫస్ట్ లుక్, పాటల్లో ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ తో పాటు డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

ఈ సినిమా నవంబర్ 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి

సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కిశోర్ కుమార్ అరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ–శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.