Skip to content

‘డోరతీ’ సినిమా ని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను: రానా దగ్గుబాటి

కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డోరతీ’. యూనిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తమిళనాట సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ‘డోరతీ’ అక్టోబర్ 2న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ‘డోరతీ’ సినిమా గురించి నెల రోజుల క్రితం కార్తీక్…

Read more

‘టాల్కమ్ పౌడర్’ నవంబర్ 13న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’, ‘చూసి చూడంగానే’ వంటి వైవిధ్యమైన, కంటెంట్‌ బేస్డ్ చిత్రాలను నిర్మించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్నారు. ఆయన ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ కందుకూరి హీరోగా ‘టాల్కమ్ పౌడర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి నాథ్ పొన్నా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ద్రిషికా చందర్ కథానాయికగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ క్రైమ్ డ్రామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను తాజాగా ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ప్రారంభించారు. గ్లింప్స్‌లో బంటీ అనే డ్రగ్ పెడ్లర్ చుట్టూ కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు. తెలియక చేసిన ఓ తప్పు కారణంగా బంటీ అనూహ్యమైన…

Read more

‘గోల్డెన్ భాగ్యం’- ఫుల్ ఫన్‌ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

కామెడీ పవర్‌హౌస్‌లు సత్య, యోగిబాబు కలిసి ఓ కొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబో తున్నారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇదే తొలి ప్రొడక్షన్ వెంచర్. తాజాగా చిత్ర బృందం టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది తెలుగు, తమిళ భాషలను కలిపి, రెండు ఇండస్ట్రీలకు చెందిన పాపులర్ యాక్టర్స్‌తో తెరకెక్కుతున్న ‘తెలుమిల్’ ప్రాజెక్ట్. గ్లింప్స్ ప్రారంభంలో ఓ తెలుగు వ్యక్తి, ఓ…

Read more

మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న నాని

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకొని చిత్ర బృందం తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. నాని, చిత్ర బృందానికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల సన్నిధికి చేరుకున్న నాని వనదేవతలకు తమ బరువుకు తూగేలా నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారులు చిత్ర బృందానికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. నానిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీటికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో మాస్…

Read more

‘ది ట్రైటర్స్ తెలుగు’.. అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకొస్తున్న ప్రైమ్ వీడియో.. హోస్ట్‌గా తొలిసారి రియాలిటీ షోలోకి హీరో తేజ సజ్జ 20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ హై-ఆక్టేన్ షో.. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్స్‌గా ప్రసారం ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రైమ్ వీడియో.. తన అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ ‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. నమ్మకం, మైండ్ గేమ్స్, మోసం, హై-స్టేక్స్ డ్రామాతో సాగే ఈ ఆసక్తికరమైన రియాలిటీ గేమ్ షో అక్టోబర్ 15, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. SOL ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌తో అవార్డు గెలుచుకున్న ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్…

Read more

‘కామ్రేడ్ కళ్యాణ్’ రివల్యూషనరీ సాంగ్ ఎత్తర ఎత్తు లాంచ్

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి 'కామ్రేడ్ కళ్యాణ్' నుంచి ఎత్తర ఎత్తు సాంగ్ లాంచ్ చేశారు. విజయ్ బుల్గానిన్ రివల్యూషనరీ ఫ్లేవర్ ఉన్న పాటను కంపోజ్ చేశారు. నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేకమైన వాయిస్‌తో పవర్‌ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ పాటకు రివల్యూషనరీ ఫీల్‌ను…

Read more

రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్

రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ (BTS) గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించడంతో పాటు.. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక పాత్ర కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూపించారు. ఈ BTS వీడియోలో దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ.. ‘రామాయణం’లాంటి సినిమాకు సరైన నటుడిని ఎంపిక చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ఇతిహాసంతో కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసం, భావోద్వేగ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడి పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ కూడా ఈ పాత్ర గురించి తన అనుభవాలను పంచుకున్నారు…

Read more

‘స్లమ్ డాగ్’ నుంచి విజయ్ సేతుపతి గ్లింప్స్‌ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రం ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఇందులో టబు పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర గ్లింప్స్‌కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర బృందం హార్ట్ టచింగ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో విజయ్ సేతుపతి అమ్మ జుబైదాగా జరీనా వహాబ్ పాత్రను పరిచయం చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత…

Read more

‘రోమియో జూలియట్’ అక్టోబర్ 23న థియేటర్లలో రిలీజ్

హర్షిత్, విశాఖ ధిమాన్‌ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాడిరెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా తెలుగు సినిమాలు ఫస్ట్ షో పడే వరకు కథను, కథలోని కీలక అంశాలను సీక్రెట్‌గా ఉంచుతాయి. అయితే ‘రోమియో జూలియట్’ మేకర్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు దాదాపు నాలుగు వారాల ముందే.. ఈరోజు చిత్రంలోని…

Read more

ప్రభాస్ రివిల్ చేసిన ‘రోమియో జూలియట్’ స్టొరీ గ్లింప్స్

హర్షిత్, విశాఖ ధిమాన్‌ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాడిరెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా తెలుగు సినిమాలు ఫస్ట్ షో పడే వరకు కథను, కథలోని కీలక అంశాలను సీక్రెట్‌గా ఉంచుతాయి. అయితే ‘రోమియో జూలియట్’ మేకర్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు దాదాపు నాలుగు వారాల ముందే.. ఈరోజు చిత్రంలోని…

Read more