Skip to content

‘స్లమ్ డాగ్’ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో వెటరన్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను జుబైదాగా మేకర్స్ పరిచయం చేశారు. ప్రేమతో కూడిన హృదయం.. పోరాటాలతో నిండిన జీవితం అంటూ రివిల్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు పవర్…

Read more

“రామాయణ” నుంచి రావణుడిగా యష్ పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. సినిమా నుంచి వస్తున్న ప్రతి కొత్త అప్‌డేట్‌తో అంచనాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఫస్ట్ అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న లార్జర్ ద్యాన్ లైఫ్ రావణుడి అవతార్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర…

Read more

‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చిత్రబృందంపై ప్రశంసల జల్లు! తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం: కేటీఆర్ అణచివేతపై ప్రజల పోరాటాన్ని కళ్లకు కట్టారు; ఈ చిత్రానికి ప్రేరణ ఎవరో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో హీరో నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల) ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. అనంతరం థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ: "సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం…

Read more

‘ప్యారడైజ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది: మోహన్ బాబు

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ బాక్సాఫీస్ తాండవం ‘ది ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా ములాఖాత్ నిర్వహించారు. మీడియా ములాఖాత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ... అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు. సుధాకర్ గారు ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా చేశారు. ఆ భగవంతుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. దర్శకుడిపై భారం వేసి,…

Read more

‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

మోస్ట్ ట్యాలెంటెడ్ విక్రమ్ ప్రభు 26వ చిత్రం 'సిటీ ఆఫ్ గోల్డ్'. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు సరసన శివత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, ఇంటర్నెట్ సంచలనం అమలా షాజీ ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. విడుదలైన కొద్దిసేపటికే మంచి స్పందన లభించింది. ఫస్ట్ లుక్‌లో విక్రమ్ ప్రభు ఎంతో ఇంటెన్స్ లుక్‌తో కూర్చుని.. చాలా క్యాజువల్‌గా బంగారు కడ్డీలను పైకి విసురుతూ పట్టుకుంటూ కనిపించారు. బంగారం విలువతో పాటు దాని చుట్టూ ఉన్న మిస్టీరియస్ ప్రపంచాన్ని కలిపి చూపించిన ఈ విజువల్ ఆసక్తిని పెంచుతోంది. గ్లింప్స్ ప్రేక్షకులను మరింత…

Read more

‘సిగ్మా’ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను: చిరంజీవి

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నేను నేరుగా కాకా షూటింగ్…

Read more

‘గరివిడి లక్ష్మి’ నుంచి కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ…

Read more

మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ ప్రారంభం

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కాకా’ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. THE BLOODY BENCHMARK సెట్ చేసేందుకు చిత్ర బృందం ఫుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తోంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్…

Read more

‘కల్కి’ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం- 2027 మిడ్‌కి ప్రొడక్షన్ పూర్తి

రెబల్ స్టార్ ప్రభాస్‌ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎక్స్‌ట్రావెగాంజా ‘కల్కి 2898 ఏడీ’ కోసం క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం ఇప్పుడు మరింత భారీ స్థాయిలో విస్తరించబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో ప్రభాస్ మరోసారి అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. తొలి భాగం అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో నెక్స్ట్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌పై…

Read more

‘రామాయణం’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. శ్రీరాముడి భక్తి భావాన్ని చాటే ‘జై జై రామ్’ రిలీజ్

‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. పదే పదే వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది. ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ: “శ్రీరాముడు ‘రామాయణం’కు హృదయం. తరతరాలుగా జీవితంలోని ప్రతి దశలో మనం ఆయనను మార్గదర్శిగా…

Read more