Skip to content

రోషన్‌ మేక హీరోగా నూతన చిత్రం ఆరంభం

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అశోక క్రియేషన్స్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం సంస్థకు ప్రొడక్షన్ నెం.3. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, యంగ్ సెన్సేషన్ రోషన్ మేక ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. విభిన్నమైన కథలు, సరికొత్త కథనాలతో సినిమాలు తెరకెక్కించే మోహనకృష్ణ ఇంద్రగంటి.. ఈ చిత్రంలో రోషన్‌ను సరికొత్త కోణంలో చూపించనున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్,ఆకట్టుకునే నటనతో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న రోషన్.. ఈ భారీ చిత్రంతో మరో కొత్త అవతార్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం నేడు ఘనంగా ప్రారంభమైంది.

ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. అనంతరం ముప్పా వెంకయ్య చౌదరి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి రోషన్ మేకను గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ సూపర్‌హీరో అవతార్‌లో చూపించేందుకు భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కథను సిద్ధం చేశారు. ఈ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఆయన దాదాపు ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ చేశారు. స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో డెవలప్ చేయడంతో పాటు, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఆసక్తికరమైన కథాంశానికి అత్యాధునిక సాంకేతికత, భారీ స్థాయి విజువల్స్‌ను జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాతో బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి రాకతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. పి.జి. విందా సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్లు రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే ఈ సినిమా కోసం భారీ విజువల్ వరల్డ్‌ను రూపొందించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్‌తో పాటు రామకృష్ణ యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్.

యంగ్ హీరో సూపర్‌హీరో జానర్‌లోకి అడుగుపెడుతుండటం, విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తుండటం, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అశోక క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రోషన్ మేకను సరికొత్త, అద్భుతమైన అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.

నటీనటులు: రోషన్ మేక, రేఖా పాండే, వినయ్ రాయ్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
బ్యానర్: అశోక క్రియేషన్స్ ప్రొడక్షన్
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
సినిమాటోగ్రఫీ: పి.జి. విందా
సంగీతం: గౌర హరి
ప్రొడక్షన్ డిజైనర్లు: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే
యాక్షన్ కొరియోగ్రఫీ: లీ విటేకర్, రామకృష్ణ
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్
కాస్ట్యూమ్స్: శిల్పా టంగుటూరు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.