Skip to content

‘టార్టాయిస్‌’ నుంచి ‘రంగు రంగు రంగు పిల్లరో…’ సాంగ్‌ లాంచ్‌

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “టార్టాయిస్”. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న “టార్టాయిస్” సినిమా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘నీ పరిచయం..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రోజు “టార్టాయిస్” సినిమా నుంచి ‘రంగు రంగు పిల్లరో..’ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘రంగు రంగు రంగు పిల్లరో..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, ప్రముఖ జానపద గాయకుడు, కవి పెంచల్ దాస్ లిరిక్స్ రాసి పాడారు. ‘రంగు రంగు రంగు పిల్లరో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘మేడలోన పిల్లవో హో హో, మేడివారి పల్లెలో హో హో, మేడలోన పిల్లవో హో హో మనసు కరగాదెందుకో, చేతికి కెంపుల గాజులు అరువు తెమ్మన్నాది, ముక్కులోకి ముక్కెరొకటి అడిగి తీసుకున్నాది, చెవుల్లోకి జోడు కమ్మలు అవుసులు నాకన్నాది, ఘల్లుఘల్లు కాలి గజ్జెలు గమనించమన్నాది, మాపటికి రమ్మంటే మాయమాటలు చెప్పుతాది, మాపటికి రమ్మంటే మాయమాటలు చెప్పుతాది, రంగు రంగు రంగు పిల్లరో ఈ వగలాడి, చెంగునెగిరే జింకపిల్లరో..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, సింగర్, లిరిసిస్ట్ పెంచల్ దాస్ పర్ ఫార్మ్ చేయడం విశేషం.

నటీనటులు – రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, తదితరులు

టెక్నీషియన్స్
————————–
యాక్షన్ – బెమనొల శ్రీకాంత్
కొరియోగ్రఫీ – రిత్విక్ కుమార్,రాజ్ కృష్ణ, వెంకట్ కాపు
ఆర్ట్ డైరెక్టర్ – దేవర మధుకర్
ఎడిటర్ – గుళ్లపల్లి మాధవ్ కుమార్
డీవోపీ – శబరి విక్నేష్
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
కో ప్రొడ్యూసర్స్ – మానస కుమార్
ప్రొడ్యూసర్స్ – విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – రిత్విక్ కుమార్
మార్కెటింగ్ : వంశీ కిృష్ణ (సినీ డిజిటల్)
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి. ఎస్. మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.