#CULT ఆడియన్స్ను ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తుంది: విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్సేన్, తారక్ సినిమాస్, గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘#CULT’ డెడ్లీ సర్వైవల్ గేమ్ ట్రైలర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ ‘#CULT’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన భారతదేశపు తొలి స్లాషర్ థ్రిల్లర్. సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ప్రమాదం, హింస, ఊహించని మలుపులతో నిండిన భయానక ప్రపంచాన్ని ఈ ట్రైలర్ పరిచయం చేస్తోంది. గోవాలోని ఒక నిర్మానుష్య ఐలాండ్…
