దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్
విజయ్ దేవరకొండ, రష్మిక పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విరోష్ టీమ్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్ ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని, అయితే ఇలా కావాలనే చేసే తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోమని విరోష్ టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్…
