వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాణంలో శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్…
సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్రం నుండి ‘జినక్ చిక’ పాట విడుదల

ఈ సందర్భంగా సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు నేను “యద్భావం తద్భవతి” చిత్రం నుండి ‘జినక్ చిక’ పాటను విడుదల చేయడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట పెప్పిగా, మాస్ వెబ్ తో పండగలకు పెళ్ళిలలో, ఫంక్షన్స్ లో అలాగే కాలేజ్ ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేసే విధంగా చాలా బావుంది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హై ఓల్టేజ్ లో ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే, ఈ పాట కూడా అలాగే ఉంది. మోస్ట్ ఎనర్జిటిక్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తుండగా ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు. వారికి, అలాగే ఈ చిత్ర బృందం అందరికీ ఈ సినిమా ద్వారా మంచి విజయం వచ్చి నిర్మాతకు కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నుండి రానున్న అన్ని పాటలు ఇలాగే అద్భుతంగా ఉంటాయని ఆశిస్తున్నాను. త్వరలో ఈ చిత్రం థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటీనటులు :
వరుణ్ సందేశ్, ఇనయ సుల్తానా, రేణు శ్రీ, సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు.
సాంకేతిక బృందం :
బ్యానర్ : ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం : రమేష్ జక్కల
నిర్మాత : ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి
సినిమాటోగ్రఫీ : శ్యామ్
సంగీతం : మిహిరామ్
మ్యూజిక్ పార్ట్నర్ : కే మ్యూజిక్ తెలుగు
పిఆర్ఓ : మధు విఆర్

