Skip to content

‘రామాయణం’ నుంచి మరో అందమైన ‘జతగూడె’ పాట రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి మరో అందమైన పాట ‘జతగూడె’ విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ కళ్యాణం అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి కళ్యాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించారు. శిరీష భాగవతుల మనసు ఆకట్టుకునేలా ఆలాపించారు.

శ్రీరాముడు, సీతమ్మ వివాహ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవిత్రమైన వివాహ వేడుకలు, అయోధ్యను దాటి సాగిన ప్రయాణం.. ఇలా శ్రీరాముడు, సీతమ్మ జీవితంలోని వివిధ ఘట్టాలను ఈ పాటలో చూపించారు. ఈ పాట ప్రతి ఒక్కరీ ఆకట్టుకుంటుంది.

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్న ఈ పాట ప్రస్తుతం వరల్డ్ ఆఫ్ రామాయణ, టీ-సిరీస్ యూట్యూబ్ ఛానళ్లలో అందుబాటులో ఉంది. అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోనూ విడుదలైంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని వెండితెరపై భారీ స్థాయిలో ఆవిష్కరిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్‌లో మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశంలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది.

ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హిందీ మార్కెట్‌లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపడుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.