‘రామాయణం’ నుంచి మరో అందమైన ‘జతగూడె’ పాట రిలీజ్
నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి మరో అందమైన పాట ‘జతగూడె’ విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ కళ్యాణం అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి కళ్యాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించారు. శిరీష భాగవతుల మనసు ఆకట్టుకునేలా ఆలాపించారు. శ్రీరాముడు, సీతమ్మ వివాహ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవిత్రమైన వివాహ వేడుకలు, అయోధ్యను దాటి సాగిన ప్రయాణం.. ఇలా శ్రీరాముడు, సీతమ్మ జీవితంలోని వివిధ ఘట్టాలను ఈ పాటలో చూపించారు. ఈ పాట ప్రతి ఒక్కరీ ఆకట్టుకుంటుంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్న ఈ…
