హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్…
“రామాయణ” నుంచి రావణుడిగా యష్ పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. సినిమా నుంచి వస్తున్న ప్రతి కొత్త అప్‌డేట్‌తో అంచనాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఫస్ట్ అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న లార్జర్ ద్యాన్ లైఫ్ రావణుడి అవతార్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు.
ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర సినిమాకు సంబంధించిన మోస్ట్ టాక్డ్ అబౌట్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇంటెన్సిటీ, పవర్‌ఫుల్ ఆరాతో ఆకట్టుకున్న యశ్.. ఈ ఐకానిక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో యశ్ తన పవర్‌ఫుల్ లుక్‌తో ఫ్రేమ్‌ను డామినేట్ చేస్తున్నారు. విలువైన రత్నాలతో అలంకరించిన మెరిసే బంగారు కిరీటం, పొరలుగా ఉన్న ముత్యాల హారాలు, భారీ బంగారు కంకణాలతో యశ్ కనిపిస్తున్నారు. ఇంటెన్స్ చూపు, ఇంపోజింగ్ ప్రెజెన్స్‌తో రావణుడి పాత్రకు కావాల్సిన రాజసం, గంభీరతను తీసుకొచ్చారు.
రావణుడు శక్తివంతమైన రాజు. అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. లంకను పరిపాలించిన శక్తిమంతమైన పాలకుడు. అలాంటి రావణుడి కమాండింగ్ డెమీనర్, పర్సనాలిటీని యశ్ తన లుక్‌లో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్.. తెరపై రావణుడి పాత్రను ఎంత గ్రాండ్‌గా ఆవిష్కరించబోతున్నారో ఒక అద్భుతమైన గ్లింప్స్ ఇస్తోంది.
దీనితో పాటు శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబేను పరిచయం చేస్తూ మరో కొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వనవాస కాలంలో అడవిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి సాగిస్తున్న ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది. పాత్రల లుక్, విజువల్స్‌లోని గ్రాండియర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామాయణాన్ని నితీష్ తివారీ తనదైన గ్రాండ్ విజన్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మహాగాథలోని భారీ స్థాయి, భావోద్వేగం, చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలను సినిమాటిక్ స్పెక్టకిల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా భారత్‌లో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
నితీష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ రెండు భాగాల మహాగాథ తెరకెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా IMAXలో విడుదల కానున్న ‘రామాయణం పార్ట్ 1’ 2026 దీపావళికి, ‘రామాయణం పార్ట్ 2’ 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

