Skip to content

‘హైందవ’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ రిలీజ్

‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్ లో ఉన్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఎవరైనా’ ను విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాలను కలిపి రూపొందించిన ఈ పాట వినగానే ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. మెలోడీ ట్యూన్, చక్కటి లిరిక్స్‌తో పాట మొదటిసారి విన్నప్పుడే కనెక్ట్ అయ్యేలా ఉంది.

కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ తమ వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. .

పాటలోని విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య కనిపించే మ్యాజిక్, వారి స్క్రీన్ ప్రెజెన్స్ పాటను మరింత ఆకట్టుకునేలా చేశాయి. ‘ఎవరైనా’ పాట ‘హైందవ’ ఆల్బమ్‌పై అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా, ఇప్పుడీ మెలోడీతో అంచనాలు పెంచింది.

ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ కన్నన్ డీవోపీగా పని చేస్తున్నారు, కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శివ కామేష్ డి ప్రొడక్షన్ డిజైనర్.

‘హైందవ’ నవంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివెన్ రామకృష్ణ
డీవోపీ: హరీష్ కన్నన్
సంగీతం: సామ్ సీఎస్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శివ కామేష్ డి
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.