రామ్ పోతినేని #RAPO23 లో సంయుక్త
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్టాత్మక #RAPO23లో ఎక్సయిటింగ్ స్టార్ చేరారు. టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. టాలీవుడ్ లక్కీ చార్మ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బర్త్‌డే పోస్టర్ సంయుక్తకు టీమ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. ఆమె ఈ సినిమాలో భాగమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆమె చేరికతో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. #RAPO23ను నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. #RAPO23తో రామ్ పోతినేని దర్శకుడిగా తొలిసారి పరిచయం అవుతున్నారు. తన విజన్‌ను తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను ఆయనే పూర్తిగా తీసుకున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై…
