Skip to content

#RAPO23తో రితేశ్ దేశ్‌ముఖ్ టాలీవుడ్ అరంగేట్రం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రతిష్ఠాత్మక చిత్రం #RAPO23 కోసం హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ దేశ్‌ముఖ్ #RAPO23తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘ఏక్ విలన్’, ‘రైడ్ 2’తో పాటు ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాజా శివాజీ’ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులని అలరించారు.

#RAPO23 కోసం రామ్ పోతినేని ఈ కథకు, తొలిసారిగా తెరకెక్కిస్తున్న నియో-నాయర్ వరల్డ్ కి మరింత బలాన్ని చేకూర్చేలా నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు రితేశ్ దేశ్‌ముఖ్ వంటి నటుడిని కీలక పాత్ర కోసం తీసుకోవడం ఈ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రత్యేకంగా రూపొందిస్తున్నారో తెలియజేస్తోంది.

సినిమా కథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో రితేశ్ దేశ్‌ముఖ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొన్నారు.

చిత్ర బృందం తాజాగా షూటింగ్ లొకేషన్‌లో తీసిన వీడియోను విడుదల చేసింది. సినిమాలోని భారీ సెట్‌ను ఈ వీడియోలో చూపించారు. వీడియోలో రితేశ్ దేశ్‌ముఖ్ సెట్‌లోకి అడుగుపెడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడ హీరో, దర్శకుడు రామ్ పోతినేని ఆయనకు ఆత్మీయంగా హగ్ ఇచ్చి స్వాగతం పలికారు. ఈ బీటీఎస్ వీడియో ప్రస్తుతం సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు ( తిరు) ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

బలమైన సాంకేతిక బృందం, భారీ నిర్మాణ విలువలు రామ్ పోతినేని విజన్‌కు తోడవడంతో #RAPO23 ఒక ప్రత్యేకమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది.

నటీనటులు: రామ్ పోతినేని, రితేశ్ దేశ్‌ముఖ్, సంయుక్త.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రామ్ పోతినేని
నిర్మాత: కృష్ణ పోతినేని
బ్యానర్: రాపో సినిమాటిక్స్
సినిమాటోగ్రఫీ: తిరునవుక్కరసు
సంగీతం: సామ్ సీఎస్
ఫైట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.