Skip to content

“భగవంతుడు” మూవీ సెకండ్ సింగిల్ ‘ఓ యెల్లమ్మ’ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం “భగవంతుడు”. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

ఈ రోజు “భగవంతుడు” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఓ యెల్లమ్మ’ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎస్. కృష్ణ ప్రసాద్ డివైన్ ట్యూన్ తో కంపోజ్ చేయగా అడ్డుల జంగిరెడ్డి పాడారు. ఈ పాటకు మూవీ డైరెక్టర్ జి.జి.విహారి లిరిక్స్ రాయడం విశేషం. ‘ఓ యెల్లమ్మ’ పాట ఎలా ఉందో చూస్తే – ‘యెల్లమ్మ అంటే ఎవరనుకున్నరు? సూర్యవంశ రాజులింట రేణుకమ్మ పుట్టెరా, దుర్గమ్మే వరమిచ్చిన ఆదిశక్తి అంశరా, అగ్గిలోంచి పుట్టినట్టి అయోనిజ తల్లిరా, జమదగ్నే మనువాడిన ముత్తైదువ అమ్మరా, తల్లి సేయి తాకి ఇసుక కడవయ్యి నిలుసురా, నాగుపాము తలనెక్కి తలపాగా సుట్టురా, నదులన్నీ ఒదిగొచ్చి కడవ నిండిపోవురా, వనవాసం కోసమని రాణీవాసం వదిలేసిన ధర్మపత్ని రేణుకమ్మరా…’ అంటూ మనసునిండా భక్తిభావం నింపేలా సాగుతుందీ పాట.

నటీనటులు: తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు, తదితరులు.

సాంకేతిక బృందం

* ఆడియో : మధుర
* కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
* యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
* పాటల రచయితలు: చంద్రబోస్, డా. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్,జి.జి. విహారి
* కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
* సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
* సంగీతం: కె.పి.
* ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
* ఎడిటర్: ప్రవీణ్ పూడి
* లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడుగుల
* పీఆర్ఓ: సురేష్ (ఎస్‌కే మీడియా)
* కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – జి. జి. విహారి
* బ్యానర్: రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
* నిర్మాత: రవి కుమార్ పనస
* సహ నిర్మాత: విద్య శ్రీ పనస

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.