“భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి 'శరణమన్న శరణం' సాంగ్ రిలీజ్ చేశారు. శ్రామిక శక్తికి నమస్కరిస్తూ 'శరణమన్న శరణం' పాటను రూపొందించారు. ఈ…
