Skip to content

“మాయలేడి” సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేసేలా మా మూవీ ఉంటుంది – హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. “మాయలేడి” సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కో ప్రొడ్యూసర్ విజిత్ మాట్లాడుతూ – ఈ సినిమాకు ముందు చాలా స్క్రిప్ట్స్ విన్నాను. కానీ ఈ కథ వింటున్నప్పుడు ఆద్యంతం ఎంటర్ టైన్ అయ్యాను. ఇదే ఎంటర్ టైన్ మెంట్ మీరు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

రైటర్ బిందు మాట్లాడుతూ – కంప్లీట్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమా రైటింగ్ వర్క్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ రాసేప్పుడు నన్ను నేను పోల్చుకున్నాను. మీకు మంచి వినోదాన్ని అందించే చిత్రమిది. అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ – మా సినిమాను క్వాలిటీ ప్రాడక్ట్ గా తీసుకురావడంలో హీరోగా, ప్రొడ్యూసర్ గా ఎక్కడా రాజీపడలేదు రాకేష్. ఈ నెల 13న థియేటర్స్ లో మాయలేడి సినిమాను చూడండి. అన్నారు.

నటి మధురిమ మాట్లాడుతూ – నేను ఈ సినిమాలో ఇందిర అనే క్యారెక్టర్ లో నటించాను. నా క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా ఉండేలా తెరకెక్కించారు డైరెక్టర్. సురేష్ కు జోడిగా నా క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఎదుర్కొనే వివిధ సందర్భాలలో ఫ్యామిలీ మెంబర్స్ గా మా స్పందన, సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అన్నారు.

నటి లావణ్య మాట్లాడుతూ – నేను, మధురిమ గారు, హీరోయిన్ ..మా ముగ్గురు క్యారెక్టర్స్ ఈ మూవీలో చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. మేము ముగ్గురం మాయలేడీలం అనుకోవచ్చు. నా భర్త క్యారెక్టర్ ను కొట్టే సీన్స్ కోసం స్పెషల్ గా స్టంట్స్ ట్రైనింగ్ తీసుకున్నా. ప్రేక్షకుల్ని టైటిల్స్ టు ఎండ్ కార్డ్ ఎంగేజ్ చేసే సినిమా ఇది. అన్నారు.

ఫైట్ మాస్టర్ అంజి మాట్లాడుతూ – ఈ సినిమాలో ఫైట్స్ కు మంచి అప్లాజ్ వస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్ సీక్వెన్సులు అన్నీ డిఫరెంట్ గా డిజైన్ చేశాం. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేసి ఈ స్టంట్స్ పర్ ఫార్మ్ చేశారు. అన్నారు.

ఎడిటర్ రవితేజ గిరిజాల మాట్లాడుతూ – మాయలేడి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ నెల 13న థియేటర్స్ లో చూడండి. అన్నారు.

డీవోపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ ప్రశంకర్ గారికి, హీరో రాకేష్ కు థ్యాంక్స్. మా సినిమాలోని బ్యూటిఫుల్ విజువల్స్ మీ అందరినీ ఆకట్టుకుంటాయి. అన్నారు.

డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ – ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే కథలోని ట్విస్ట్స్ రివీల్ అవుతాయి. అందుకే ట్రైలర్ లో కూడా ఇంద్రజ గారు లాంటి ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. స్క్రీన్ మీదే వారి క్యారెక్టర్స్ ను ఎంజాయ్ చేయాలి. ఈ చిత్రానికి దాదాపు కొత్త టీమ్ పనిచేసినా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. విశాల్ సాంగ్స్ కే కాదు సీన్స్ కు కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా సందర్భాల్లో సాంగ్ ఫైట్ కలిసి ఉంటాయి. డాన్స్, ఫైట్ మాస్టర్స్ కలిసి వాటిని కంపోజ్ చేశారు. రాకేష్ కెరీర్ లో ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి డిఫరెంట్ మూవీస్ చేశారు. వాటికి కమర్షియల్ హంగులు జోడిస్తే ఎలా ఉంటుందో మాయలేడి అలా ఉంటుంది. హీరోయిన్ మధుమిత క్యారెక్టర్ లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ స్క్రీన్ ఆకట్టుకుంటాయి. ఈ కథ విన్నప్పుడు హీరోయిన్ కు ఎడ్జ్ ఉండే స్క్రిప్ట్ ఇది అయినా నేను ఈ స్క్రిప్ట్ వదులుకోను అని రాకేష్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కథను నమ్మి ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు. మీరంతా మా సినిమాతో థియేటర్స్ లో ఒక కొత్త తరహా లవ్ స్టోరీ ఉన్న ఎంటర్ టైనర్ చూడబోతున్నారు. అన్నారు.

హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ – ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించడం అదృష్టంగా భావిస్తున్నా. మాయలేడి సినిమాలో నా క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూస్తారు. ఈ సినిమాలో నేను చేసిన స్టంట్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు మీరు మంచి రెస్పాన్స్ చూపించారు. ఆ రెస్పాన్స్ తో నాకు మీరు వెల్ కమ్ చెప్పినట్లు భావిస్తున్నా. ఈ నెల 13న మాయలేడి సినిమాను థియేటర్స్ లో చూడండి. బాగా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.

డైరెక్టర్ మహేశ్ బాబు .పి. మాట్లాడుతూ – ఈ సినిమా కోసం రాకేష్, డైరెక్టర్ ప్రశంకర్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ నెల 13న వారికి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. హీరోయిన్ బాగా పర్ ఫార్మ్ చేస్తోంది. ట్విన్స్ ను ప్రేమించిన ఓ కుర్రాడి కథ ఇది. డైరెక్టర్ ప్రశంకర్ మంచి రైటర్. నాకు 15 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమాతో దర్శకుడిగా ఆయన టాలెంట్ చూడబోతున్నాం. రాకేష్ నేను తరుచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయనకు ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ – రాకేష్, డైరెక్టర్ ప్రశంకర్ ఇద్దరూ నాకు మంచి మిత్రులు. రాకేష్ ను నా కుటుంబ సభ్యుడిలా భావిస్తా. నా గూఢచారి సినిమాలో రాకేష్ నటించాడు. సినిమా పట్ల చాలా ప్యాషన్ తో ఉంటాడు. అలాగే ప్రశంకర్ నేను కలిసి కొన్ని స్క్రిప్ట్స్ కు వర్క్ చేశాం. రైటర్ గా ఆయన సెన్సబిలిటీస్ నాకు తెలుసు. వీళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 13న మీతో పాటు నేనూ థియేటర్ లో సినిమా చూస్తాను. అన్నారు.

హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే మాట్లాడుతూ – పేకమేడలు, ఎవరికి చెప్పొద్దు తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు మాయలేడి స్క్రిప్ట్ విన్నాను. నేను ఈ సినిమా చేసేందుకు రెండు ప్రధాన కారణాల్లో ఒకటి స్క్రిప్ట్, రెండోది డైరెక్టర్ గా ప్రశంకర్ కు ఉన్న ప్యాషన్. మేము ఈ సినిమా అనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్స్ ఏవీ లేవు. మధుమిత హీరోయిన్ గా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మా టీమ్ లో జాయిన్ అయ్యాక..ప్రాజెక్ట్ స్పీడప్ అయ్యింది. సురేష్, సత్య, మధురిమ, లావణ్య..ఇలా టీమ్ ఫామ్ అయ్యింది. మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా మూవీ చేశాం. కాస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలని ప్రయత్నించాం. టెక్నీషియన్స్ ను తీసుకోవవడం లో కూడా మా విజన్ ఉంది. అది స్క్రీన్ మీద మీరే చూస్తారు. మీ అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాం. ఈ నెల 13 రిలీజ్ టఫ్ డేట్ అని తెలుసు. చాలా సినిమాలు ఆ తేదీన వస్తున్నాయి. నాపై అభిమానంతో మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డేట్ ఎందుకు అని కూడా చెప్పారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ఎన్ని సినిమాల మధ్యనైనా మా సినిమా ఆదరణ పొందుతుందని మేము నమ్మాం. ఆ కంటెంట్ నే నమ్ముకుని ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అయితే మరికొందరు కొత్త వాళ్లతో నేను సినిమాలు చేయగలుగుతాను. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో థియేటర్స్ కు వస్తే హ్యాపీగా బయటకు వెళ్తారు. అది ప్రేక్షకులకు ఇచ్చే నా ప్రామిస్. అన్నారు.

నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు

టెక్నీషియన్స్
——————–
మ్యూజిక్ – విశాల్ చంద్రశేఖర్
బ్యానర్ – క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – రాకేష్ వర్రే
స్క్రిప్ట్, డైరెక్షన్ – ప్రశంకర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.