Skip to content

రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి సినిమాగా ‘కొక్కొరొకో’ రూపొందుతోంది. ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రీసెంట్‌గానే ‘కొక్కొరొకో’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ ఓ అందమైన గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. శీను కోసం పార్వతి ఎదురుచూస్తుండగా.. ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి చెరువులో నుంచి పూలు సేకరించి తీసుకొస్తుంటాడు . ఇలా వీరిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు, అమాయకమైన ప్రేమను ఈ గ్లింప్స్‌లో అందంగా చూపించారు.

ఈ గ్లింప్స్‌లో నటీనటుల సహజమైన నటన, శీను, పార్వతి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందమైన విజువల్స్, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిన్న గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వెండితెరపై ఓ అందమైన ప్రేమకథను చూడబోతున్నామనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీనివాస్ వసంతాల కథ చెప్పే విధానంపై నమ్మకంతోనే దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. వినూత్నమైన ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తూ శ్రీనివాస్.. ‘కొక్కొరొకో’తో విజువల్‌గా కొత్త అనుభూతిని అందించడంతో పాటు, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తారని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ గాయకుడు జీవీ సాగర్. సీనియర్ రచయిత జి. సత్యమూర్తి తనయుడైన ఆయన.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు సోదరుడు. ‘కొక్కొరొకో’ సినిమాకు జీవీ సాగర్ మాటలు అందిస్తున్నారు. తండ్రి రచనా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇప్పటికే ‘రాక్షసుడు’ తర్వాత డైలాగ్ రైటర్‌గా ఆయన చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ఆకాష్ ఆర్. జోషి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. లండన్‌కు చెందిన ప్రతిభావంతుడైన సంగీతకారుడు సంకీర్తన్ సంగీతం సమకూరుస్తున్నారు.

డా.జ‌యంతి లాల్ స‌మ‌ర్ప‌ణ‌లో పెన్ స్టూడియోస్‌, ఆర్‌.వి.స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని రేఖా వర్మ, కూరపాటి శిరీష నిర్మిస్తుండగా.. నీలాద్రి ప్రొడక్షన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రమేష్ వర్మ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. ఐదు విభిన్న కథలతో కూడిన ఆసక్తికరమైన ఆంథాలజీగా, కొత్త ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌తో ‘కొక్కొరొకో’ తెరకెక్కుతోంది. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీన‌టులు:
సముద్రఖని, సునీల్, చైతన్య రావు మదాడి, మురళీ కృష్ణ, త్రిష్, సప్తగిరి, సుబ్బరాజు, ప్రవీణ్, రామలింగ, శ్రీనివాస్ వడ్లమాని, జెమిని సురేష్, పమ్మి సాయి, గోపిక ఉదయ, ప్రియాంక కుమార్, ప్రీతి నేహా, బేబీ ఎం.వి. కృతి నందన, చాముండేశ్వరి చౌదరి, లక్ష్మి, వేద్విక సోనీ, అశోక్ కుమార్, గుల్లు దాదా (అద్నామ్ సాజిద్ ఖాన్), వినోద్ సాగర్ తదితరులు

ఎ ర‌మేష్ వ‌ర్మ ప్రొడక్ష‌న్‌

బ్యానర్లు: పెన్ స్టూడియోస్, ఆర్‌వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్
సమర్పణ: డా. జయంతీలాల్ (పెన్ స్టూడియోస్)
దర్శకుడు: శ్రీనివాస్ వసంతాల
నిర్మాతలు: రేఖా వర్మ, కూరపాటి శిరీష
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీ కృష్ణ
సినిమాటోగ్రఫీ: ఆకాష్ ఆర్. జోషి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: ఎస్. కృష్ణ ప్రసాద్
మాటలు: శ్రి సాగర్
కొరియోగ్రఫీ: గ్రీష్మ
ఫైట్స్: వెంకట్ ఎన్. వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
సౌండ్ డిజైనర్: శివ ఘటం
పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
అసోసియేట్ ఎడిటర్: కోరాడ మణికంఠ
కో-డైరెక్టర్: శేషు బలగ
పబ్లిసిటీ డిజైనర్: పెద్ది రామ్
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ కాకా
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.