రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి సినిమాగా ‘కొక్కొరొకో’ రూపొందుతోంది. ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్‌గానే ‘కొక్కొరొకో’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ ఓ అందమైన గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. శీను కోసం పార్వతి ఎదురుచూస్తుండగా.. ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి చెరువులో నుంచి పూలు సేకరించి తీసుకొస్తుంటాడు . ఇలా…
