Skip to content

“భగవంతుడు” మూవీ షూటింగ్ పూర్తి

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం “భగవంతుడు”. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు లిరికల్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు, తదితరులు.

సాంకేతిక బృందం

* ఆడియో : మధుర
* కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
* యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
* పాటల రచయితలు: చంద్రబోస్, డా. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్,జి.జి. విహారి
* కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
* సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
* సంగీతం: కె.పి.
* ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
* ఎడిటర్: ప్రవీణ్ పూడి
* లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడుగుల
* పీఆర్ఓ: సురేష్ (ఎస్‌కే మీడియా)
* కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – జి. జి. విహారి
* బ్యానర్: రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
* నిర్మాత: రవి కుమార్ పనస
* సహ నిర్మాత: విద్య శ్రీ పనస

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.