రామ్ పోతినేని #RAPO23 రెండో షెడ్యూల్ పూర్తి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న #RAPO23 చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రామ్ పోతినేని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ఈ సినిమాతో తన ప్రత్యేకమైన విజన్‌ను తెరపై ఆవిష్కరించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేనికి జోడీగా సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో భాగంగా భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఏకంగా ఒక కిలోమీటర్ మేర విస్తరించిన భారీ స్ట్రెచ్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఆ మొత్తం ప్రాంతాన్ని లైట్స్‌తో నింపి, సినిమా ప్రత్యేకమైన నియో-నోయిర్ వరల్డ్‌కు సరిగ్గా సరిపోయేలా అద్భుతమైన విజువల్ క్యాన్వాస్‌ను…
