ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ…
గిరిబాబు మృతికి సంతాపంగా ఆది సాయికుమార్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వాయిదా..
ఆది సాయికుమార్ హీరోగా మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా లాంఛింగ్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు చేయాల్సిఉండగా…ప్రముఖ నటులు గిరిబాబు స్వర్గస్థులైన కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త్వరలోనే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ ను చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

