Skip to content

గిరిబాబు గారి మృతిపట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్

ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేశారు. ''ప్రముఖ నటులు గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏

Read more

గిరిబాబు మృతికి సంతాపంగా ఆది సాయికుమార్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వాయిదా..

ఆది సాయికుమార్ హీరోగా మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా లాంఛింగ్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు చేయాల్సిఉండగా...ప్రముఖ నటులు గిరిబాబు స్వర్గస్థులైన కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త్వరలోనే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ ను చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని…

Read more

గిరిబాబు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నందమూరి బాలకృష్ణ

సీనియర్‌ నటులు, దర్శక నిర్మాత గిరిబాబు మరణవార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. నా కెరీర్‌ ప్రారంభంలోనే 'అన్నదమ్ముల అనుబంధం'లో ఆయనతో కలిసి నటించాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. గిరిబాబు మంచి నటుడు మాత్రమే కాదు... మంచి వ్యక్తి కూడా. ఆయన లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గిరిబాబు తనయుడు రఘుబాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

Read more