అనుమాన పక్షి యూనిక్ ఫిలిం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా చాలా పెద్ద విజయం…
రామ్ పోతినేని #RAPO23 రెండో షెడ్యూల్ పూర్తి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న #RAPO23 చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రామ్ పోతినేని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ఈ సినిమాతో తన ప్రత్యేకమైన విజన్‌ను తెరపై ఆవిష్కరించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేనికి జోడీగా సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు.
తాజా షెడ్యూల్‌లో భాగంగా భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఏకంగా ఒక కిలోమీటర్ మేర విస్తరించిన భారీ స్ట్రెచ్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఆ మొత్తం ప్రాంతాన్ని లైట్స్‌తో నింపి, సినిమా ప్రత్యేకమైన నియో-నోయిర్ వరల్డ్‌కు సరిగ్గా సరిపోయేలా అద్భుతమైన విజువల్ క్యాన్వాస్‌ను క్రియేట్ చేశారు. ఈ భారీ సెటప్‌కు సంబంధించిన ఫ్లైట్ వ్యూ చూస్తేనే సీక్వెన్స్‌ను ఎంత గ్రాండ్‌గా మౌంట్ చేశారో అర్థమవుతోంది.
యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ మాస్టర్ ఈ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేయగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునావుక్కరసు (తిరు) ఈ విజువల్స్‌ను చిత్రీకరించారు. రామ్ పోతినేని ఊహించిన ప్రత్యేకమైన విజన్‌కు అనుగుణంగా సినిమాకు డిఫరెంట్ విజువల్ టెక్స్చర్‌ను అందిస్తున్నారు.
ఈ చిత్రానికి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
రెండో షెడ్యూల్ పూర్తవడంతో పాటు, ఇప్పటివరకు చూడని విజువల్ స్పెక్టాకిల్‌ను ప్రేక్షకులకు అందిస్తామని మేకర్స్ హామీతో #RAPO23పై క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. భారీ విజువల్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్ పోతినేని ఒక ప్రత్యేకమైన నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నటీనటులు
రామ్ పోతినేని, సంయుక్త
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం: రామ్ పోతినేని
నిర్మాత: కృష్ణ పోతినేని
బ్యానర్: రాపో సినిమాటిక్స్
సంగీతం: సామ్ సీఎస్
డీఓపీ: తిరునావుక్కరసు
స్టంట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్

