అనుమాన పక్షి యూనిక్ ఫిలిం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా చాలా పెద్ద విజయం…
అనిల్ రావిపూడి క్లాప్ తో ప్రారంభమైన ‘పెద్దగట్టు జాతర’

ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘పెద్దగట్టు జాతర’ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రంతో విరాన్ష్ హీరోగా డెబ్యూ చేస్తున్నారు. ఎ. రామ కృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్. సి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు చిత్రం బృందం ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించింది. ముహూర్తపు సన్నివేశానికి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి క్లాప్ కొట్టి సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించారు. దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
పలువురు సినీ ప్రముఖులు, యూనిట్ సభ్యులు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రంలో దేవి ప్రసాద్, మీనా కుమారి, సత్యకృష్ణ, సురేఖా వాణి, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి నాగార్జున డీఓపీ, గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు: విరాన్ష్, దేవి ప్రసాద్, మీనా కుమారి, సత్యకృష్ణ, సురేఖా వాణి, ప్రభాకర్ (బాహుబలి), ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, అజయ్ ఘోష్, నాగమహేష్, బలగం రమేష్, లౌక్య
బ్యానర్: ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్
రచన, దర్శకత్వం: విజయ్ కుమార్ సి.హెచ్
నిర్మాత: ఎ. రామ కృష్ణ రెడ్డి
డీఓపీ: నాగార్జున
ఆర్ట్ డైరెక్టర్: గిరీష్ దేవాంగ్
లిరిక్ రైటర్స్: కాసర్ల శ్యామ్, సుద్దాల అశోక్ తేజ
కో-డైరెక్టర్: అర్జున్ మొగలిపాక
చీఫ్ అసోసియేట్: టి. నాగేంద్ర
అసోసియేట్స్: నరేష్ ఎం, విశాల్ ధోండి
పీఆర్వో: వంశీ-శేఖర్

