భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం…
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన ‘కమిటీ కుర్రోళ్ళు’
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించారు. వైవిధ్యమైన కథాంశంతో యదు వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటు ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌తో పాటు అవార్డుల రేసులోనూ సత్తా చాటుతోంది. శనివారం (జూలై 18) రోజున భారత ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో కమిటీ కుర్రోళ్లు సినిమా రెండు అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలవటంతో పాటు మేకప్ కేటగిరిలో (పి.రవికుమార్) ఈ సినిమా అవార్డును దక్కించుకుంది.
ఇది వరకే అంటే 2024లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక పురోగతిని ప్రతిబింబించే కేటగిరిలో ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. దర్శకుడు యదు వంశీ సైతం ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డును అందుకున్నారు.
అలాగే దుబాయ్‌లో జరిగిన గామా 2025 అవార్డ్స్ వేడుకలో బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెల, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీ అవార్డులను దక్కించుకున్నారు. సైమా 2025 అవార్డ్స్‌లోనూ ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక, ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా సందీప్ సరోజ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 అవార్డ్ వేడుకల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా నామినేట్ అయ్యి అంతర్జాతీయంగా గుర్తింపును సంపాదించుకుందీ ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం. కేరళలో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీ, ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా సందీప్ సరోజ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
డిఫరెంట్ కంటెంట్‌తో పాటు 16 మంది నూతన నటీనటులను పరిచయం చేయటంలోనూ ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు దక్కటంతో పాటు అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా సినిమాలను చేస్తున్నారు. రూ.9 కోట్లతో రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రూపంలో సత్తా చాటింది. థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.6 కోట్లను దక్కించుకుని మొత్తంగా రూ.24.5 కోట్లను రాబట్టిన చిత్రంగా సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’..సత్తా చాటుతూ తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలవటమే కాకుండా మేకప్ విభాగంలోనూ విజేతగా నిలవటం మనకెంతో గర్వకారణం.





