యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్కు…
“చంద్రయాన్” సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్కు అతిథిగా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి
- నవంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ
రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా నవంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “చంద్రయాన్” సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్ ను డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసినవాళ్లంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లు. ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ శ్రీనాథ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ వేదిక మీద పర్ ఫార్మ్ చేసిన సాంగ్ కు హర్ష మంచి మ్యూజిక్ ఇచ్చారు. చంద్రయాన్ సినిమా ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతోంది. అన్నారు.
డీవోపీ శ్రీనివాస. బి. మాట్లాడుతూ – మా చంద్రయాన్ సినిమా రాకెట్ రివీల్ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం మా శ్రీనాథ్ అన్న కల్పించారు. అలాగే మా వేణు ఊడుగుల అన్న టీమ్ అందరికీ సపోర్ట్ గా ఉండి నడిపిస్తున్నారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ మాట్లాడుతూ – చంద్రయాన్ సినిమాకు పనిచేయడం ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నా. ఈ సినిమాకు కొత్త తరహాలో మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. మా సినిమాలో మ్యూజిక్ మీకు తప్పకుండా కొత్తగా అనిపిస్తుంది. నవంబర్ 13న రిలీజ్ కు వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.
నటుడు లోకేష్ మాట్లాడుతూ – ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చిన్నా. అయితే నేను చేసే కామెడీ పెద్దగా ఉంటుంది. రాకెట్ లాంఛ్ ఇక్కడ చేశాం. నవ్వుల లాంఛ్ నవంబర్ 13న థియేటర్స్ లో చేయబోతున్నాం. ఈ రాకెట్ ఆకాశంలోకి ఎగిరిపోతుంది. మా సినిమాలోని నవ్వులు మీ మనసులో నిలిచిపోతాయి. ఎక్కాలు కూడా రాని మేము ఈ రాకెట్ ఎలా తయారు చేశాం, చందమామ వరకు వెళ్లామా లేదా అనేది థియేటర్స్ లోనే చూడాలి. అన్నారు.
నటుడు రవి శివతేజ మాట్లాడుతూ – మా సినిమా నవంబర్ 13న థియేటర్స్ లోకి వస్తోంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఒక కొత్త అనుభూతిని మీకు కలిగించే చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న శివకుమార్ ను ఆదరించండి. మీరు సక్సెస్ ఇస్తే ఇలాంటి యంగ్ హీరో మరిన్ని చిత్రాలు చేయగలుగుతారు. అన్నారు.
హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ – చంద్రయాన్ నాకు స్పెషల్ మూవీ. ఇది నా తొలి సినిమా కావడం సంతోషంగా ఉంది. మా మూవీపై ఇప్పటికే మీరు ఆదరణ చూపిస్తున్నారు. అప్సరస సాంగ్ కు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ తెలుగు అమ్మాయి పాత్రలో నటించాను. మీ అందరికీ నా క్యారెక్టర్ నచ్చుతుందని నమ్ముతున్నాను. మా సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. నవంబర్ 13న మీరు థియేటర్స్ లో మా సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ ప్రవీణ్ మొలక మాట్లాడుతూ – మా సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన సంకల్ప్ గారికి థ్యాంక్స్. మా సినిమాకు వెన్నంటి ఉన్న వేణు గారికి కృతజ్ఞతలు. మా టీమ్ అంతా కష్టపడి ఒక కొత్త తరహా ప్రయత్నం చేశాం. మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఈ నెల 30నే మా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పాం. అయితే సీనియర్ హీరోలను గౌరవించాలి. మేము నవంబర్ 13న మా సినిమా రిలీజ్ కు తీసుకొస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – ఊరిలోని నలుగురు కుర్రాళ్లు. వాళ్లు ఏం చేయలేరు అని అంతా అనుకున్నప్పుడు ఏదైనా చేయగలం అని ముందడుగు వేస్తారు. ఏం చేద్దామని ఆలోచించి రాకెట్ తయారు చేసి చంద్రుడి మీదకు వెళ్దామని డిసైడ్ అవుతారు. వీళ్లు ఏదైనా అనుకుంటే ఆగే వాళ్లు కాదు. మందమర్రి టు చందమామ, ఆగేది కాదిది ఫుల్ హంగామా అని పాటలో రాసినట్లు ఉంటారు. ఈ నలుగురు సినిమాలో చేసే హంగామా ఆగదు. థియేటర్స్ లోకి మీరు అడుగుపెట్టగానే నవ్వుల హంగామా స్టార్ట్ అవుతుంది. రాకెట్ లో శివ చేసే అల్లరిని మీరు ఎంజాయ్ చేస్తారు, రాకెట్ తయారుచేసేందుకు వీళ్లు పడిన పాట్లను ఎంజాయ్ చేస్తారు. రాకెట్ చేసేందుకు వీళ్లకు వచ్చిన ఐడియాస్ ను ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కలిపి బ్యూటిఫుల్ ఫన్ మూవీలో చూస్తారు. అన్నారు.
చిత్ర సమర్పకులు వేణు ఊడుగుల మాట్లాడుతూ – ఈ సినిమా చూసిన తర్వాత నచ్చి ప్రెజెంటర్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. వీళ్లది మంచి ఎనర్జిటిక్ టీమ్. ప్రాణం పెట్టి సినిమా కోసం పనిచేశారు. ఇంట్లో కూతురి పెళ్లి చేస్తే ఎంత ప్రేమతో చేస్తారో, అలాంటి ప్రేమతో ప్యాషన్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం కూడా అంతే ఆరాటపడుతున్నారు. శివకుమార్ ప్రతిభావంతుడు. ఆయన ఫ్యూచర్ లో మరిన్ని మంచి మూవీస్ చేయబోతున్నాడు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ మూవీని ఎంకరేజ్ చేసిన నిర్మాత ప్రవీణ్ గారిని అభినందిస్తున్నా. ఇలాంటి వినూత్నమైన సినిమా వస్తుందంటే కారణం ప్రవీణ్ గారే. డైరెక్టర్ శ్రీనాథ్ మంచి స్క్రిప్ట్ చేసుకున్నారు. ఎంతో ఇన్నోసెన్స్ ఉన్న సినిమా ఇది. లాజిక్స్ ఉండవు. సెన్స్ ఉండని నాన్ సెన్స్ కామెడీ ఉంటుంది. కానీ వెరీ సెన్సిబుల్ మూవీ ఇది. హానెస్ట్ గా తీసిన చిత్రమిది. నవంబర్ 13న మా సినిమాను థియేటర్స్ లో చూసి మీరంతా ఇదే రెస్పాన్స్ ఇస్తారు. చంద్రయాన్ భారత్ సత్తాను ప్రపంచానికి ఎలా చాటిందో ఈ చంద్రయాన్ వీళ్లందరి ప్రతిభను ఇండస్ట్రీకి తెలియజేస్తుందని నమ్ముతున్నాను. అన్నారు.
హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ – నేను కొత్త హీరో కాబట్టి కొంత భయంగా ఉండేది. కానీ ప్రతి సందర్భంలో నాకు మా మూవీ టీమ్ తో పాటు మీడియా మిత్రులు సపోర్ట్ గా నిలిచారు. ఈ చిత్రంలో హీరోగా అవకాశం కల్పించిన మా డైరెక్టర్ శ్రీనాథ్, మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి థ్యాంక్స్. మమ్మల్ని పెద్ద దిక్కులా నడిపిస్తున్న వేణు అన్నకు థ్యాంక్స్. ఏదైనా చేసేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లే నలుగురు కుర్రాళ్ల కథ ఇది. డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్ లోనే ఆ ఫన్ ఉంది. రాకెట్ తయారుచేసే సీన్స్, ఆ రాకెట్ లో నేను పడే ఇబ్బందులు..ఇవన్నీ మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. నటుడిగా ఈ క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేయడానికి కష్టపడ్డాను. మా సినిమాకు వర్క్ చేసిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే. మా యంగ్ టీమ్ ను మీరు సపోర్ట్ చేస్తారని, మా సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ – ఈవెంట్ వేదిక చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. చంద్రయాన్ సినిమా నవంబర్ 13న థియేటర్స్ లోకి వస్తోంది. వీళ్లందరికీ ఇది తొలి సినిమా అంటే లాంచింగ్ ప్యాడ్ లాంటిది. మీరు సినిమా చూసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు చేసే ఎంకరేజ్ మెంట్ వారికి దక్కుతుంది. మూన్ మీదకు లాంఛ్ అవుతున్న ఈ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు
టెక్నీషియన్స్
—————
కాస్ట్యూమ్ డిజైనర్ – శశి కోసూరి
ఎడిటర్ – పుల్లారావు దాసరి
ప్రొడక్షన్ డిజైనర్స్ – శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్
డీవోపీ – శ్రీనివాస. బి.
మ్యూజిక్ – హర్ష ప్రవీణ్
సమర్పణ – వేణు ఊడుగుల
ప్రొడ్యూసర్ – ప్రవీణ్ మొలక
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – శ్రీనాథ్ చంద్రశేఖర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

