వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్…
‘ఇరుముడి’కి పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: రవితేజ

మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు. స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సాయి సురేష్ చాలా నేచురల్‌గా ఆర్ట్ వర్క్ చేశారు. తను చాలా జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలాగే మా డీఓపీ విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు. తను చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తాడు. అలాగే దినేష్ సీలేరులో అన్నీ చాలా అద్భుతంగా చూసుకున్నారు. బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్, అలాగే మా డైరెక్టర్ శివ ఈ సినిమాకి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ గారు, రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సతీష్‌తో ఇంకా చాలా సినిమాలు చేయాలి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్లు పడుతున్న ఆనందం మాటల్లో చెప్పలేను. వాళ్లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోవిడ్ తమిళ్ మలయాళ సినిమాలు ఎక్కువగా చూశాం. అవన్నీ రూటెడ్‌గా ఉండేవి. అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. ‘ఇరుముడి’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా, మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు మళ్లీ ‘ఇరుముడి’ సినిమా చూడడానికి థియేటర్‌కి రావడం కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ ఆనందం మామూలుది కాదు. నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చేశాను. డైరెక్టర్ త్రినాథ్ పాత్ర, ‘ఇరుముడి’ అనే టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మా శీను ఈ సినిమా విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మొదటి నుంచి ‘సూపర్‌హిట్ సినిమా సార్’ అని చెబుతూనే ఉండేవాడు. తన నమ్మకం నిజమైంది. ఇంత మంచి సినిమా చేసినందుకు మా డైరెక్టర్ థాంక్యూ. తనది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇంత పెద్ద విజయం వచ్చినా సరే చాలా నార్మల్‌గా ఉంటాడు. ప్రియా భవాని శంకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ పండడానికి తను సెకండ్ హాఫ్‌లో చేసిన ఆ రెండు సీన్స్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి. అలాగే బేబీ నక్షత్ర అద్భుతంగా చేసింది. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.డైరెక్షన్ టీమ్‌కి, ప్రొడక్షన్ టీమ్‌కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మాటలకు అందని రియాక్షన్ ఇది. ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఆ రియాక్షన్‌లో అర్థమైంది. ‘ఇరుముడి’ సినిమా ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ సినిమాలో చిన్న పని చేసిన వారు కూడా ఈ సినిమాకు పనిచేశామని గొప్పగా చెప్పుకునే ఆనందాన్ని ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌కి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ‘ఇరుముడి’ సినిమాకు డిస్ట్రిబ్యూషన్స్ నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలను ఆడియన్స్ తమ ఇళ్లల్లోకి తీసుకున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ నన్ను గుండెల్లోకి తీసుకున్నారు. ఈ సినిమా విజయం నాకు మరింత బాధ్యతను పెంచింది. రవితేజ గారు సినిమా కోసం ఏం కావాలో అవన్నీ చేశారు. ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రతే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం. ఈ సినిమా ప్రయాణంలో శ్రీనివాసరాజు చాలా సపోర్ట్ చేశారు. రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు. మొన్న సినిమా చూసి కూడా అదే ఎమోషన్‌తో మాట్లాడారు. సాయికుమార్ గారు కథ చెప్పిన తర్వాత నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా ఓన్ చేసుకుని సినిమా చేశారు. డీఓపీ విష్ణు, డైరెక్టర్ సాయిసురేష్ నేచురల్ వర్క్ ఇచ్చారు. అనంత శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి చక్కగా లిరిక్స్ రాశారు. నవీన్ గారు, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి చేసిన ‘ఖుషి’ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది. కాకపోతే ఆ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని మేము ఊహించుకున్నాం. ఇరుముడి అలాంటి పెద్ద విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. ప్రియా భవాని శంకర్ గారు కావేరి పాత్రని చాలా రియలిస్టిక్‌గా చేశారు. నక్షత్ర చాలా ధైర్యం గల పాప. తను మణెమ్మ పాత్రలో ఎంతలా జీవించిందో ఆడియన్స్ రియాక్షన్స్ చెప్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ కథ వినగానే పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని చెప్పారు. కల్ట్ క్లాసిక్ మూవీ అవుతుందని ట్వీట్ చేస్తానన్నారు. కానీ నేనే వద్దని చెప్పాను. ఆ రోజు ఆయన రాసుకున్న ట్వీట్‌ను ఈరోజు నాకు చూపించారు. మా సినిమా మీద ఆయనకు అంత నమ్మకం ఉంచారు. సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే స్వసికకు టీచర్ పాత్ర చెప్పగానే, ఎలాంటి అనుమానాలు లేకుండా పాత్ర చాలా బాగుందని, ఒక నటిగా నేను నిరూపించుకుంటానని చెప్పి చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో స్టూడెంట్స్‌గా చేసిన మిగతా ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రవితేజగారు నాకు అన్నయ్యతో సమానం అయిన మీడియా కూడా ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ పెద్ద సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను ఈ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేక్షకులు అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. విష్ణు గారు, సాయి సురేష్ గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ కూడా చాలా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీడియాకు, సోషల్ మీడియాకు, ప్రేక్షకులకు అందరికీ థాంక్యూ. డైరెక్టర్ శివ నిర్వాణ ఒక క్లాసిక్ సినిమా తీశారు. తను ఈ సినిమా దర్శకుడిగా చాలా కాలం గుర్తుండిపోతారు. ఈ సినిమాను మించిన సినిమా ఆయన మళ్లీ తీయాలని కోరుకుంటున్నాను. కావేరి లాంటి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. విజయాన్ని అందుకున్న మా నిర్మాతలకు కంగ్రాజులేషన్స్. రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. రవితేజ గారితో కలిసి చేసిన ఈ సినిమా ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్యూ.
బేబీ నక్షత్ర మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు. మణెమ్మగా నన్ను అభిమానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, నిర్మాతలకు, మా హీరో రవితేజ గారికి థాంక్యూ.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ముందుగా ఇది మనందరి సినిమాగా ముందుకు తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా చూసిన అందరూ ఇస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మేము ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీశాం గానీ, ఇంత ఎమోషనల్ అయిన సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా చూసి వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నా, చదువుతున్నా కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. ఈ సినిమా అంతా ప్రభావితం చేసింది. అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే, రవితేజ గారు మొత్తం మా టీమ్ అందరికీ పెద్ద హిట్ ఇచ్చారు. ఇదంతా ఒక చైన్ రియాక్షన్‌లాగా జరిగింది. సినిమా రోజురోజుకీ పెరుగుతోంది. మా డైరెక్టర్ శివ ఒక మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది. చాలా పెద్ద నెంబర్స్ కనిపిస్తాయని భావిస్తున్నాం. అందరికీ థాంక్యూ.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. సినిమా విడుదలైనప్పటి నుంచి అభినందనలు, కలెక్షన్స్ రిపోర్ట్స్ నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. రవితేజ గారికి ఈ సినిమా చూడగానే కాల్ చేసి చెప్పాను. ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్. ఇలాంటి క్యారెక్టర్ రవితేజ గారే చేయగలరు. ఈరోజు ఆడియన్స్ రియాక్షన్ కూడా అలానే ఉంది. అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాబై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాను మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రభంజనం మరో నాలుగు వారాలపాటు కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
సాయికుమార్ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమా మా అందరికీ గొప్ప ఎమోషన్. మైత్రి మూవీ మేకర్స్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. మొదట సీలేరులో ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి, మంచి కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టడం జరిగింది. మంచి మనసుల కలయిక ఈ ‘ఇరుముడి’. ‘ఇరుముడి’ కారణంగా సీలేరు పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారింది. నా 50 ఏళ్ల ప్రస్థానంలో ‘ఇరుముడి’ లాంటి సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రవితేజ అంటే మా ఫ్యామిలీ. . మైసూర్‌లో ఈ సినిమా చూశాను. అక్కడ కూడా థియేటర్ అంతా హౌస్‌ఫుల్‌గా ఉంది. నాగార్జున గారి షూటింగ్‌కి మైసూర్ వెళ్లాను. నాగార్జున గారు కూడా రవితేజకు కంగ్రాట్స్ చెప్పారు. ఇందులో అందరూ కూడా అద్భుతంగా నటించారు. ఈ సక్సెస్‌కు కారణమైన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. శివ నిర్వాణ గారు ఈ కథ మొదలైనప్పటి నుంచి అలాగే ముగింపుకు కావలసిన పాటలను నాతో రాయించే గొప్ప బాధ్యతను నా మీద పెట్టారు. ఈ సినిమా నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టం. రవితేజ గారు ఇలాంటి విజయాలు మళ్లీ మళ్లీ అందుకోగలరు. మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు, టెక్నీషియన్లు అందరినీ కూడా తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు. అందుకే వారికి వరుసగా విజయాలు వస్తున్నాయి. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
స్వసిక మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమాకి పాన్ ఇండియా నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి, డైరెక్టర్ శివ నిర్వాణ గారికి, మా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డీఓపీ విష్ణు శర్మ మాట్లాడుతూ.. ‘మజిలీ’ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ గారితో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే నేను తెలుగు సినిమాకు వచ్చినప్పటి నుంచి మైత్రి మూవీ మేకర్స్‌లో పనిచేయాలని కోరిక. ఈ సినిమాతో అది తీరింది. రవితేజ గారికి ఎందుకు అంత క్రేజ్ ఉందో ఆయనతో పని చేసిన తర్వాత తెలిసింది. ఆయన డెడికేషన్ అద్భుతం. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. చివరి 30 నిమిషాలు కంటతడి పెట్టుకున్నామని చెప్తున్నారు. మేము ఆ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాం. సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.

