Skip to content

27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’

సామాజిక మార్పు కోసం సాగిన మహోన్నత పోరాటం ‘ఫూలే’.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు!
జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కోరుతున్న చిత్ర బృందం
సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా తెరకెక్కింది ‘ఫూలే’ చిత్రం… సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించే కథాంశంతో రూపొందింది.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఫూలే దంపతుల సామాజిక సేవ, వారి జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చారిత్రాత్మక కథనం. నేటి యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.
ఈ సందర్భంగా సినిమా విడుదలకు సంబంధించిన వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా మిత్రులు తమ ప్రచారం, సహకారం అందించాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేస్తోంది.
చిత్ర వివరాలు:
చిత్రం: ఫూలే (తెలుగు డబ్బింగ్) దర్శకుడు: అనంత్ మహదేవన్
నిర్మాణ సంస్థ: సుపదా క్రియేషన్స్ – తెలుగునిర్మాత: డా. పొన్నం రవిచంద్ర
విడుదల తేదీ: నవంబర్ 27
మీడియా మిత్రుల సహకారాన్ని కోరుతూ..

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.