సామాజిక మార్పు కోసం సాగిన మహోన్నత పోరాటం ‘ఫూలే’.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు!…
భారతీయ సినీ రంగంలో కొత్త ప్రయోగంగా ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’

అత్యాధునిక ఏఐ సాంకేతికతతో ఫోటోరియలిస్టిక్ విజువల్స్, రామాయణంలోని లక్ష్మణుడి వీరగాథను ఆవిష్కరించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’. రామాయణ మహాకావ్యంలో శ్రీరాముడికి అండగా నిలిచి, ఎన్నో సాహసాలు చేసిన మహా యోధుడు, శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడి జీవితంలోని వెలుగులోకి రాని విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించి, భారతదేశంలోనే తొలి ఫోటోరియలిస్టిక్ ఏఐ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
సరికొత్త కథనం, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర నిర్మాణ రంగంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర, ఆయన సాహసాలు, త్యాగాలు, వీరత్వాన్ని సరికొత్త కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
శ్రీమతి మాతా రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. పి రాధాకృష్ణ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ మాతా, నితిన్ మాతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బియాండ్ ఎక్స్ స్టూడియో, napo.si సంస్థలు ఏఐ సాంకేతిక నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యేలా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్ర అధికారిక పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా డిజిటల్‌గా విడుదల చేయగా, మల్కాజిగిరి ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీ ఈటల రాజేందర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఒక గొప్ప యోధుడి జీవితం, ఇప్పటివరకు పెద్దగా తెలియని ఆయన వీరగాథను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో ప్రపంచానికి పరిచయం చేయనున్న ‘ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ’ పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది.

