సామాజిక మార్పు కోసం సాగిన మహోన్నత పోరాటం ‘ఫూలే’.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు!…
‘గోగులు గోగులు..’ లిరికల్ సాంగ్ రిలీజ్

- డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “ఇడుపు కాయితం” సినిమా నుంచి ‘గోగులు గోగులు..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ ట్యూన్ తో ‘గోగులు గోగులు..’ సాంగ్ కంపోజ్ చేశారు. శ్రీలత (నాగదుర్గ), శ్రీనివాస్ (ప్రియదర్శి) వివాహ వేడుక నేపథ్యంలో ఈ పాట చిత్రీకరించారు. ఈ పాటకు కొంగరి కృష్ణ సాహిత్యాన్ని అందించగా, అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ పాడారు. ‘గోగులు గోగులు..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి, గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి, గోగులు గోగులు గోపాలకృష్ణుడు ఆనంద బాలుడు నందకుమారుడు, రమ్మనరే రమ్మనరే నలుగుకు నా ముద్దు గోపాలకృష్ణున్ని, రమ్మనరే నలుగుకు నా ముద్దు గోపాల కృష్ణుని…’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
నటీనటులు – ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు
టెక్నికల్ టీమ్
————————–
కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వత్ భైరి
ఆర్ట్ డైరెక్టర్ – ఆశిష్ తేజ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
డీవోపీ – ఎంఎన్ బాల్ రెడ్డి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ – సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్
ప్రొడ్యూసర్ – బన్నీవాస్, తబిత సుకుమార్
స్క్రిప్ట్, డైరెక్షన్ – వంశీరెడ్డి దొండపాటి
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా), మడూరి మధు

