లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన “ఇడుపు కాయితం” మూవీ
ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్…
