ప్రామిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్…
‘అయిగిరి నందిని’ భక్తి గీతానికి గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చిన ‘మహాకాళి’
ఆర్‌కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘మహాకాళి’ చిత్రం నుంచి మేకర్స్ తొలి పాట ‘అయిగిరి నందిని’ని విడుదల చేశారు. అమ్మవారి మహిమను కీర్తించే అత్యంత ప్రసిద్ధమైన, భక్తిశ్రద్ధలతో ఆలపించే ఈ స్తోత్రాన్ని శక్తిమంతమైన సంగీత రూపంలో ఆవిష్కరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో ఎంతో విశిష్టమైన ఆదిశంకరాచార్యుల రచనకు గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు. అమ్మవారి ఉగ్రశక్తి, దివ్య తేజస్సు, అపారమైన శక్తి సామర్థ్యాలను కీర్తించే ఈ పాట పవర్‌ఫుల్ వోకల్స్, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన సౌండ్‌స్కేప్‌తో అలరిస్తోంది. తరతరాలుగా భక్తుల హృదయాల్లో నిలిచిన ఈ స్తోత్రానికి సరికొత్త శక్తిని జోడిస్తూ, దైవిక స్త్రీ శక్తికి, మహాకాళి అమ్మవారి మహిమాన్విత రూపానికి అద్భుతమైన నివాళిగా ‘అయిగిరి నందిని’ నిలుస్తోంది.
ఇప్పటికే ‘మహాకాళి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ వార్ క్రై టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ జోష్‌ను కొనసాగిస్తూ తాజాగా విడుదలైన ‘అయిగిరి నందిని’ పాట సినిమా ప్రపంచంలోని మరో కోణాన్ని పరిచయం చేస్తోంది. గతంలో అక్షయ్ ఖన్నా గ్లింప్స్ ద్వారా సినిమా ఇంటెన్సిటీ చూపించిన మేకర్స్, ఇప్పుడు ఈ పాటతో కథలోని ఆధ్యాత్మిక, భక్తి భావాలను ముందుకు తీసుకొచ్చారు. మహాకాళి అమ్మవారి దివ్యశక్తిని ప్రధానంగా ఆవిష్కరించారు.
స్మరణ్ సాయి స్వరపరిచి, ప్రోగ్రామ్ చేసి, సంగీత రూపకల్పన చేసిన ఈ పాటకు అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ పవర్ ఫుల్ వాయిస్ అందించారు. సంప్రదాయ భక్తి సంగీతాన్ని గ్రాండ్ కాంటెంపరరీ సౌండ్‌స్కేప్‌తో అద్భుతంగా మేళవించారు. వీణ, వేణువు, గిటార్స్, పియానో, తవిల్, మృదంగం వంటి పలు వాయిద్యాల సమ్మేళనం పాటకు ప్రత్యేకమైన సంగీత అనుభూతిని అందిస్తోంది. లేయర్డ్ బ్యాకింగ్ వోకల్స్, గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్ పాటలోని ఇంటెన్స్ మరింత పెంచాయి. ‘అయిగిరి నందిని’లోని భక్తి భావాన్ని, పవిత్రతను ఏమాత్రం తగ్గించకుండా సినిమాటిక్ స్కేల్‌లో రూపొందించడం విశేషం. కొత్త తరం శ్రోతలకు కూడా ఈ స్తోత్రంలోని గొప్పతనాన్ని మరింత చేరువ చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’ భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథలను భారీ సినిమాటిక్ విజన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ యూనివర్స్‌కు పునాది వేసిన ‘హనుమాన్’ సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, ‘మహాకాళి’ మరో ఆసక్తికరమైన ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, ఖుష్బూ సుందర్, భూమి శెట్టి, రోహిత్ సారఫ్, రాకేష్ బేడీ, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహాకాళి’ 2027 జనవరి 8న థియేటర్లలో విడుదల కానుంది. ‘అయిగిరి నందిని’ పాటతో మేకర్స్ సినిమాకు అద్భుతమైన మ్యూజికల్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అమ్మవారిపై తరతరాలుగా కొనసాగుతున్న భక్తిని, మహాకాళి చిత్రంలోని భారీ సినిమాటిక్ విజన్‌ను ఈ పాట చక్కగా ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు వచ్చిన స్పందనకు తోడు, తాజాగా ఈ పాట కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. భక్తి, శక్తి, భారతీయ సాంస్కృతిక వారసత్వం నేపథ్యంలో ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ‘మహాకాళి’ సిద్ధమవుతోంది.

