Skip to content

‘అయిగిరి నందిని’ భక్తి గీతానికి గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చిన ‘మహాకాళి’

ఆర్‌కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘మహాకాళి’ చిత్రం నుంచి మేకర్స్ తొలి పాట ‘అయిగిరి నందిని’ని విడుదల చేశారు. అమ్మవారి మహిమను కీర్తించే అత్యంత ప్రసిద్ధమైన, భక్తిశ్రద్ధలతో ఆలపించే ఈ స్తోత్రాన్ని శక్తిమంతమైన సంగీత రూపంలో ఆవిష్కరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో ఎంతో విశిష్టమైన ఆదిశంకరాచార్యుల రచనకు గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు. అమ్మవారి ఉగ్రశక్తి, దివ్య తేజస్సు, అపారమైన శక్తి సామర్థ్యాలను కీర్తించే ఈ పాట పవర్‌ఫుల్ వోకల్స్, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన సౌండ్‌స్కేప్‌తో అలరిస్తోంది. తరతరాలుగా భక్తుల హృదయాల్లో నిలిచిన ఈ స్తోత్రానికి సరికొత్త శక్తిని జోడిస్తూ, దైవిక స్త్రీ శక్తికి, మహాకాళి అమ్మవారి మహిమాన్విత రూపానికి అద్భుతమైన నివాళిగా ‘అయిగిరి నందిని’ నిలుస్తోంది. ఇప్పటికే ‘మహాకాళి’ సినిమాపై భారీ…

Read more
‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రం హనుమాన్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంస్టాల్మెంట్ మహాకాళి. దీనిని RKD స్టూడియోస్‌ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. RK దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ఛావాలో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర డెప్త్ ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని…

Read more