Skip to content

“నువ్వు రమ్మంటే” సాంగ్ విడుదల

ఆయాతి క్రియేషన్స్ పతాకం పై ఢీ అభి, నైనిక అనసురు, రాను బొంబాయికి రాను ఫేమ్ లిఖిత నటించిన సాంగ్ “నువ్వు రమ్మంటే”. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయడం విశేషం. ఈ పాటను ఈ పాటను ప్రముఖ నిర్మాత సంధ్యా శ్రీధర్ కంతేటి నిర్మించారు. కుమార్. జి. దర్శకత్వం వహించారు. కల్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. ఈ పాట విడుదల కార్యక్రమం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

సింగర్ రామ్ రాథోడ్ మాట్లాడుతూ – ఈ పాట లాంఛ్ కు నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేయడం సంతోషంగా ఉంది. గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ తో కలిసి ఈ వేదిక షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది. రాహుల్ సిప్లిగంజ్ అన్న ఇన్స్ పిరేషన్ తోనే నేను ఫోక్ సాంగ్స్ చేయడం ప్రారంభించాను. ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ సంధ్యా శ్రీధర్ కంతేటి మాట్లాడుతూ – నేను పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయన ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. నేను అలాంటి ఒక సాంగ్ చేయాలని అనుకున్నాను. అయితే బ్యానర్ పెట్టడం, పాట ప్రొడ్యూస్ చేయడం ఇలాంటి వాటిపై ఐడియా లేదు. కానీ గణేష్ మాస్టర్, లిఖిత వీళ్లంతా ముందుకు రావడంతో అన్నీ అలా కలిసొచ్చాయి. ఈ సాంగ్ మంచి విజయం సాధిస్తుందని మేమంతా నమ్ముతున్నాం. అన్నారు

హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ – నువ్వు రమ్మంటే సాంగ్ లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని చెప్పగానే వెంటనే పాటకు ఒప్పుకున్నాను. ఈ పాటను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ఢీ అభి మాట్లాడుతూ – ఇది నాకు ఫస్ట్ ఫోక్ సాంగ్. ఈ పాట లాంఛ్ కు నా ఫేవరేట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సింగర్ రాహుల్ అన్న అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. ఎంతోమంది హీరోలకు కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ మాస్టర్ నా పాటకు కొరియోగ్రాఫ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాట ఎన్నో విధాలుగా నాకు స్పెషల్. ఈ సాంగ్ మీ అందరికీ తప్పకుంచా నచ్చుతుంది. అన్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ – ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. ఈ పాట చాలా బాగుంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. కల్యాణ్ కీస్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాట కాన్సెప్ట్ క్రెడిట్ గణేష్ మాస్టర్ కే దక్కుతుంది. “నువ్వు రమ్మంటే” పాట ఈ టీమ్ అందరికీ పేరు తీసుకురావాలి. అన్నారు.

భాను మాస్టర్ మాట్లాడుతూ – ఈ సాంగ్ లాంఛ్ కు మా గురువుగారు గణేష్ మాస్టర్ నన్ను అతిథిగా పిలవడం సంతోషంగా ఉంది. ఆయన కళను ప్రేమించే వ్యక్తి. అందుకే స్టార్ హీరోస్ తో సినిమాలు చేసినా ఈ రోజు ఒక ఫోక్ సాంగ్ ను దాదాపు ఈ కొత్త టీమ్ తో చేశారు. ఈ పాట చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – “నువ్వు రమ్మంటే” సాంగ్ చాలా బాగుంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో మంచి క్రియేటివిటీ ఉంటుంది. ఈ పాటలో ఇంకా మంచి స్టెప్స్ డిజైన్ చేశారు. పాట కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇదే పాట మంచి కమర్షియల్ సినిమాలో ఉంటే కోట్ల రూపాయలు సంపాదించి పెడుతుంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో వర్క్ చేయడం అభి అదృష్టం. అభికి ఈ పాటతో హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. లిఖిత అందంగా ఉంది, పాట బాగా చేసింది. నైనిక..ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

గణేష్ మాస్టర్ మాట్లాడుతూ – నా మిత్రులు శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ మా పాట లాంఛ్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ పాట ఇంత బాగా వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్ సంధ్యా శ్రీధర్ గారు. ఆమె ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సాంగ్ ఇలా చేయడం సాధ్యమైంది. కల్యాణ్ కీస్ ఈ పాటను చాలా బాగా కంపోజ్ చేశారు. అభి పాట కోసం ఎంతో కష్టపడ్డారు. లిఖిత బొంబాయికి రాను పాటతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్ కోసం అడగగానే చేస్తానంటూ ముందుకొచ్చింది. మంచి సాంగ్ ఇది. ఈ పాట మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.