జూబ్లీహిల్స్‌లో సామూహిక శ్రీమంతం
2,000 మంది గర్భిణీ మహిళలకు పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. కాబోయే తల్లులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వారికి పుట్టింటి కానుకగా చీర-సారెతో పాటు పసుపు, కుంకుమ అందజేశారు. మహిళలతో కలిసి సామూహికంగా శ్రీమంతం నిర్వహించి వారికి శుభాకాంక్షలు…
