Skip to content

‘సిగ్మా’ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ & ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్

సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’కు మరింత బలం చేకూరింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది.

‘సిగ్మా’కు ఈ అసోసియేషన్ ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా నిలవనుంది. తెలుగు మార్కెట్‌లో బలమైన మార్కెట్ ప్రెజెన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌లో మంచి అనుభవం ఉన్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను విజయవంతంగా రిలీజ్ చేసింది. ఇప్పుడు ‘సిగ్మా’తోనూ సినిమాకు మ్యాసీవ్ రీచ్, స్ట్రాంగ్ థియేట్రికల్ పొజిషనింగ్ లభించనుంది.

భారీ స్థాయిలో సినిమాలను నిర్మించడంలో పేరున్న లైకా ప్రొడక్షన్స్, తెలుగు మార్కెట్‌తో పాటు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్, రిప్యూటేషన్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ కలిసి రావడం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఎన్‌వీఆర్ సినిమా అసోసియేషన్ కూడా మరో ప్లస్‌గా నిలవనుంది.

ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. హరిహరసుతన్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు.

అక్టోబర్ 2న ‘సిగ్మా’ థియేటర్లలోకి రానుంది. గాంధీ జయంతి హాలిడేకు తోడు వీకెండ్ కూడా కలసి రావడంతో సినిమాకు మంచి అడ్వాంటేజ్ లభించనుంది. యాక్షన్-అడ్వెంచర్ అప్పీల్, బలమైన టెక్నికల్ టీమ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్‌వీఆర్ సినిమా మద్దతుతో ‘సిగ్మా’ గ్రాండ్ గా థియేట్రికల్‌ రిలీజ్ కు సిద్ధమౌతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.