‘సిగ్మా’ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ & ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్
సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’కు మరింత బలం చేకూరింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. ‘సిగ్మా’కు ఈ అసోసియేషన్ ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా నిలవనుంది. తెలుగు మార్కెట్‌లో బలమైన మార్కెట్ ప్రెజెన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌లో…
