Skip to content

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి. బాల ఫిల్మ్స్, పి.జి. ముత్తయ్య ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.పి. బాల, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఎలెవన్’ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కెరీర్‌లో 51వ చిత్రంగా రూపొందుతున్న ‘NC 51’ కొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

చెన్నైలో అక్టోబర్ 26, సోమవారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం షూటింగ్ విజయవంతంగా పూర్తవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ వేడుక చేసుకుంది. ఈ చిత్రంలో హరిప్రియ రోషిణి, బాల శరవణన్, కాళీ వెంకట్, రవిశంకర్, రాజా రవీంద్ర, నవీన్ నేని, ఆదవ్ చంద్ర, అభిషేక్, విజయ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.జి. ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శక్తి బాలాజీ సంగీతం సమకూరుస్తున్నారు. అజయ్ మనోజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

డి. క్రాఫోర్డ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, డేంజర్ మణి ఫైట్ మాస్టర్‌గా, కార్తీక్ నేత లిరిసిస్ట్‌గా పనిచేస్తున్నారు. అనీషా రేహానా, హగినో షున్సుకే కెవిన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా నిర్మాతలు ఆర్.పి. బాల, పి.జి. ముత్తయ్య సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.