నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి
నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి. బాల ఫిల్మ్స్, పి.జి. ముత్తయ్య ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.పి. బాల, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎలెవన్’ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కెరీర్లో 51వ చిత్రంగా రూపొందుతున్న ‘NC 51’ కొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. చెన్నైలో అక్టోబర్ 26, సోమవారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం షూటింగ్ విజయవంతంగా పూర్తవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ వేడుక చేసుకుంది. ఈ చిత్రంలో హరిప్రియ రోషిణి, బాల…
