Skip to content

జూబ్లీహిల్స్‌లో సామూహిక శ్రీమంతం

2,000 మంది గర్భిణీ మహిళలకు పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ

పోషకాహార వారోత్సవాల్లో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.

కాబోయే తల్లులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వారికి పుట్టింటి కానుకగా చీర-సారెతో పాటు పసుపు, కుంకుమ అందజేశారు. మహిళలతో కలిసి సామూహికంగా శ్రీమంతం నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచులకు అన్నగా అండగా నిలుస్తూ, వారి పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

అదేవిధంగా చిన్నారులు తొలిసారిగా అన్నం రుచి చూసే సంప్రదాయబద్ధమైన అన్నప్రాసన కార్యక్రమాన్ని గద్వాల్ విజయలక్ష్మి గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు కలిసి నిర్వహించి చిన్నారులకు ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమానికి TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, అజ్జరుద్దీన్ గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గద్వాల్ విజయలక్ష్మి గారు, మైనార్టీ నాయకులు ఫాహీం ఖురేషి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ గారు, MLC అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, చిత్తం పర్ణిక రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, టీజీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సామ రామ్మోహన్ రెడ్డి గారు, గద్దర్ వెన్నెల గారు, కాల్వ సుజాత గారు, కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు, దీపక్ జాన్ గారు, సరిత తిరుపతయ్య గారు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.