27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’
సామాజిక మార్పు కోసం సాగిన మహోన్నత పోరాటం ‘ఫూలే’.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు! జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కోరుతున్న చిత్ర బృందం సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా తెరకెక్కింది ‘ఫూలే’ చిత్రం... సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం…
